మరోసారి మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్

byసూర్య | Wed, Jun 22, 2022, 07:54 AM

తెలంగాణలో మరోసారి కరోనా కేసులు పెరగడంతో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జారీ చేసింది. అవేంటంటే..
10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికెళ్లాలి.
20 నుంచి 50 ఏళ్లలోపు వారు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర ముఖ్యమైన పనులకు బయటికెళ్లేటప్పుడు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి నుంచి బయటికెళ్లే ప్రతిసారి మాస్కులు ధరించాలి.
మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల కంటే ఎక్కువ భౌతిక దూరం పాటించాలి.
అవసరం లేకుండా ప్రయాణాలు చేయకూడదు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి.
వాక్సినేషన్ రెండు డోసులు తప్పకుండా తీసుకోవాలి.


Latest News
 

ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM
ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం Tue, Jul 05, 2022, 11:50 AM
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM