కాలం మారుతోంది...సర్కారీ బడికి మహా డిమాండ్

byసూర్య | Wed, Jun 22, 2022, 01:31 AM

ఓడలు బండ్లు అవుతాయని, బండ్లు ఓడలవుతాయన్న సామెతలో ఎంత నిజయో తెలీదు కానీ ఎప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు బాగుపడవు అన్నదానినుంచి ఎంతో బాగపడ్డాయి అన్న దశకు వాతావరణం మారింది. ఇదిలావుంటే ఇటీవల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు విద్యా బోధ‌న‌లో స‌త్తా చాటుతున్నాయి. ఫ‌లితంగా ఏటికేడు స‌ర్కారీ బ‌డుల్లో అడ్మిష‌న్ల కోసం పిల్ల‌ల త‌ల్లిదండ్రులు క్యూ క‌డుతున్నారు. ఏపీలో నాడు-నేడు, తెలంగాణ‌లో మ‌న ఊరు- మ‌న‌బ‌డి కార్య‌క్ర‌మాల‌తో స‌ర్కారీ బ‌డుల‌ను బాగు చేసే కార్య‌క్ర‌మాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వెర‌సి స‌ర్కారీ బ‌డుల్లో ప్ర‌వేశాలు ఏమాత్రం ఆల‌స్యం చేసినా దొర‌క‌డం లేదు. ఈ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టేలా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కె.శ్రీనివాస‌రెడ్డి మంగ‌ళ‌వారం ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


టీఆర్ఎస్ కీల‌క నేత‌, తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్ధిపేట‌కు చెందిన ఓ స‌ర్కారీ బ‌డిలో ప్ర‌వేశాల కోసం పోటెత్తిన ఫొటోను శ్రీనివాస‌రెడ్డి పోస్ట్ చేశారు. ఈ ఫొటోను చూస్తుంటే... ఏ ప్రైవేట్ పాఠ‌శాల‌లో కూడా ప్ర‌వేశాల కోసం ఈ త‌ర‌హా ర‌ద్దీ క‌నిపించ‌దేమో అన్న భావ‌న క‌లుగుతోంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితి ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలే నిద‌ర్శ‌న‌మంటూ శ్రీనివాస‌రెడ్డి తెలిపారు.


Latest News
 

మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM