వారి కొడుకుల ఆగడాలు పెరిగిపోతున్నాయ్: రేవంత్ రెడ్డి

byసూర్య | Wed, Jun 22, 2022, 12:02 AM

 సీఎం సొంత పార్టీ, ఆయన తొత్తు పార్టీ నేతల కొడుకుల ఆగడాలకు ఆడపిల్లలు బలైపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలలా ప్రతిరోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత పార్టీ, ఆయన తొత్తు పార్టీ నేతల కొడుకుల ఆగడాలకు ఆడపిల్లలు బలైపోతున్నారని అన్నారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నా ఫాంహౌస్ సీఎం, డమ్మీ హోం మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రెండు వారాల్లో ఇన్ని అత్యాచారాలా? అంటూ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు.


Latest News
 

ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM
ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం Tue, Jul 05, 2022, 11:50 AM
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM