అంతాల మనస్సు పారేసుకొన్నాడు మరీ

byసూర్య | Tue, Jun 21, 2022, 02:23 PM

తనకు దక్కనిది ఇంకెవ్వరికి దక్కకూడదని అనుకొన్నాడు. అందుకోసం ఏకంగా దొంగగా మారాడు అతను. మనుషుల్లో భిన్నరకాల మనస్తత్వాలు కలిగినవాళ్లు ఉంటారు. తమకు దక్కనిదాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు. హైదరాబాద్ మల్లాపూర్ కు చెందిన 40 ఏళ్ల ఫరీద్ కూడా అలాంటివాడే. ఫరీద్ మొదట్లో ఓ కూరగాయల వ్యాపారి. సైకిల్ పై గల్లీ గల్లీ తిరుగుతూ కూరగాయలు విక్రయించేవాడు. 


ఇతర వ్యాపారులు టీవీఎస్ ఎక్స్ఎల్ పై తిరుగుతూ అమ్మకాలు సాగిస్తుండడాన్ని గమనించిన ఫరీద్, తాను కూడా ఎక్స్ఎల్ వాహనం కొనాలని భావించాడు. అయితే, తన వద్ద ఉన్న డబ్బు అందుకు సరిపోదని భావించాడు. కానీ టీవీఎస్ ఎక్స్ఎల్ పై ఆయన అంతలా మనస్సు పారేసుకొన్నాడు. దీంతో టీవీఎస్ ఎక్స్ఎల్ ల చోరీల బాటపట్టాడు. టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం కనిపిస్తే చాలు... ఎత్తుకుపోవడం మొదలుపెట్టాడు. ఆ విధంగా 24 నెలల వ్యవధిలో 23 మోపెడ్లు చోరీ చేశాడు. ఒక మోపెడ్ చోరీచేసిన తర్వాత దానిపై కొన్నాళ్లపాటు కూరగాయలు విక్రయించి తన మోజు తీర్చుకునేవాడు. ఆపై రూ.10 వేలకు దాన్ని అమ్మేసి, మరో మోపెడ్ చోరీచేసేవాడు.


 అయితే, కేవలం టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్లే మాయం అవుతుండడాన్ని గమనించిన పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించి ఫరీద్ ను పట్టుకున్నారు. ఫరీద్ ను ప్రస్తుతం రిమాండ్ కు తరలించారు. తనకు గేర్లు ఉండే ఇతర బైకులు నడపడం రాదని, అందుకే టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్లనే చోరీకి ఎంచుకున్నానని ఫరీద్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.


Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM
ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM