ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్థంతి సందర్బంగా ఘన నివాళులు

byసూర్య | Tue, Jun 21, 2022, 01:27 PM

తెలంగాణ పోరాటంలో తనవంతు కృషిని అందించిన ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుడు ముబారక్ బాబా ఆచార్య జయశంకర్‌ కు ఘన నివాళులర్పించారు. తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ అని ఆయన అన్నారు. వెలకట్టలేని సేవలు, అత్యున్నత వ్యక్తిత్వం ఆయన సొంతమని కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని స్పష్టంచేశారు. ఆయనతో పాటు హై స్కూల్ ప్రధానోపాద్యులు , మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వారి సిబ్బంది, ప్రింట్ & ఎలక్ట్రానిక్ పాత్రికేయులు తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తెలంగాణ గీతాన్ని ఆలపించి పుష్పాంజలి తో ఘన నివాళులర్పించారు.


 


 


Latest News
 

ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి Tue, Jul 05, 2022, 10:34 AM
బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబాల గుట్టురట్టు Tue, Jul 05, 2022, 10:32 AM
నేడు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు Tue, Jul 05, 2022, 10:20 AM