![]() |
![]() |
byసూర్య | Tue, Jun 21, 2022, 01:23 PM
సోమవారం హైదరాబాద్ లోని బోరబండ కు చెందిన పెళ్లి బస్సు వికారాబాద్ నియోజకవర్గం, బర్వాద్ గ్రామం, కోటపల్లి మండలానికి వచ్చి పెళ్లి ముగించుకొని తిరిగు ప్రయాణంలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేసారం రైల్వే బ్రిడ్జి కింద నీళ్లల్లో బస్సు ఇరుక్కొని ముందుకు కదలు లేక అక్కడే ఇరుక్కుపోయింది. అందులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. తెల్లవారేసరికి బస్సు పూర్తిగా నీటిలో మునిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.