బిజెపి నుంచి టీఆర్ఎస్ లోకి చేరికలు

byసూర్య | Tue, Jun 21, 2022, 12:49 PM

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బురెడ్డి యాదిరెడ్డి సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యాది రెడ్డిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సాదరంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ఒక్క టిఆర్ఎస్ తోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ భోజిరెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, నాయకులు నరేష్, యాదగిరి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతు.! Tue, Jul 05, 2022, 12:42 PM
మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM