హైదరాబాద్‌లో పెట్రోల్ ధర

byసూర్య | Tue, Jun 21, 2022, 11:24 AM

గతకొన్ని రోజులుగా భారీగా తగ్గిన క్రూడాయిల్‌ ధరలకు ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.ప్రస్తుతం బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 115 డార్లపైకి చేరాయి. అయితే సహజంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగాలి. కానీ ప్రస్తుతం మాత్రం దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్లో నిపుణుల అంచనా ప్రకారం ఈ స్థిరత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం కనిపించడం లేదు. పెరుగుతోన్న క్రూడ్‌ ఆయిల్‌ ధరల కారణంగా రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో పెరుగుదల అనివార్యమని అంచనా వేస్తున్నారు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో మంగళవారం పెట్రోల్‌, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.


 దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ రేట్‌ రూ. 96.72గా ఉండగా, డీజిల్‌ రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్‌ రూ. 111.35 కాగా, డీజిల్‌ రూ. 96.72గా ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 102.63 పలుకగా, డీజిల్‌ రూ. 94.24గా ఉంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.92 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 87.87గా ఉంది.


 హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ మంగళవారం పెట్రోల్‌ రేట్‌ రూ. 109.64గా ఉండగా, డీజిల్‌ రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.74గా ఉండగా, డీజిల్‌ రూ. 99.49వద్ద కొనసాగుతోంది.సాగర నగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.46గా ఉండగా, డీజిల్‌ రేట్‌ రూ. 98.25గా నమోదైంది.


Latest News
 

బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM
తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు Sat, Apr 20, 2024, 09:26 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు Sat, Apr 20, 2024, 09:19 PM
కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM