భూగర్భడ్రైనేజీ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : మ్మెల్యే కేపి వివేకానంద్

byసూర్య | Tue, Jun 21, 2022, 11:12 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ఏఎస్ఆర్ బృందావన్ కాలనీకి చెందిన ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో చేపడుతున్న భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కాలనీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీధర్, సుబ్బరాజు, వెంకట్, రవికాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక Fri, Jul 01, 2022, 10:53 AM
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత Fri, Jul 01, 2022, 10:41 AM
విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి Fri, Jul 01, 2022, 10:39 AM
వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ Fri, Jul 01, 2022, 10:38 AM
కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు Fri, Jul 01, 2022, 10:36 AM