తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

byసూర్య | Tue, May 24, 2022, 10:17 AM

తెలంగాణ సర్కార్ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ లను అందిస్తుంది..ఇప్పటికే పలు విభాగాల్లో ఉన్న కొలువుల గురించి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూనే ఉంది.తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.గ్రూప్స్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అదిరిపొయె గుడ్ న్యూస్ అనే చెప్పాలి.గ్రూప్ 4 లో త్వరలోనే కొన్ని పోస్టులను భర్థీ చేయనుంది.. ఈ మేరకు నోటిఫికేషన్ ను కూడా విడుదల చేశారు.నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన ఉండడంతో.. వేకెంట్ పోస్టులను మరింతగా పెంచనున్నారు..


రాష్ట్ర వ్యాప్థంగా 9,168 గ్రూప్-4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు అదనంగా 600-700 పోస్టులు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-4 మొత్తం పోస్టుల 9,800 దాటుతుందని సమాచారం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో గ్రూప్-4 పోస్టులపై ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అదనపు పోస్టులపై చర్చ జరిగినట్లు సమాచారం. అవసరమైతే కొందరికి ప్రమోషన్లు ఇచ్చి మరీ.. పోస్టుల సంఖ్య పెంచాలని హెచ్‌వోడీలు ఆదేశించారు.


 


పోస్టుల సంఖ్య మరింతగా పెంచితే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని.. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రూప్-4 పోస్టుల పెంపుపై సర్కార్ దృష్టి సారించింది.ఈ పోస్టుల గురించి జూన్ 4 న స్పష్టత రానుంది.గ్రూప్-4 నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.జూన్ 15 తర్వాత నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ నెల 29 కల్లా రోస్టర్ పాయింట్లు, ఇతర వివరాలు రెడీ చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది..మరింత ఆలస్యం అవ్వడం ఖాయమని తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మరో కొంత మందికి లబ్ది చేకూరుతుందని సర్కారు అభిప్రాయ పడుతుంది..


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM