మరింత యాక్టివ్ గా టీ పీసీసీ సోషల్ మీడియా టీం

byసూర్య | Mon, May 23, 2022, 08:28 PM

కాలంతో పాటు పరిగెత్తకపోతే  ఎవరైనా వెనకబడాల్సిందే. అందుకే తాజాగా తెలంగాణ కాంగ్రెస్  నాయకత్వం తన సోషల్ మీడియా టీంను మరింత యాక్ట్యూవ్ గా నడపాలని నిర్ణయించింది. ఇదిలావుంటే  మ‌ల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత  టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా చాలా యాక్టివ్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత ఈ బృందం మ‌రింత యాక్టివ్ అయిపోయింది. ప్ర‌తి అంశం మీద క్ష‌ణ కాలం కూడా ఆల‌స్యం చేయ‌కుండా పార్టీ వైఖ‌రిని వెల్ల‌డిస్తూ సాగుతున్న ఈ బృందం చ‌ర్య‌ల‌తో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉందో  ఇటీవల విడుదలైన  ఓ పోటో తెలియజేస్తోంది. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా టీ కాంగ్రెస్ కార్యాల‌యం గాంధీ భ‌వ‌న్ మెట్ల ముందు ఓ జ‌న స‌మూహం క‌నిపించింది. దాదాపుగా 40 మందితో కూడిన ఈ బృంద‌మే టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా బృంద‌మ‌ట‌. ఈ విష‌యాన్ని ఆ బృందం స‌భ్యుడు, న‌వీన్ అనే వ్య‌క్తి వెల్ల‌డించారు.  


Latest News
 

విలాస జీవితం కోసం...దోంగగా మారిన ఎంబీఏ Wed, Jul 06, 2022, 05:48 PM
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు...అలజడిలో భాగ్యనగరం Wed, Jul 06, 2022, 05:47 PM
ఆవిషయంలో జోక్యం చేసుకొని...తెలంగాణలో శాంతి భద్రతలు రక్షించండి: కేసీఆర్ కు రఘురామ లేఖ Wed, Jul 06, 2022, 05:46 PM
బాలిక ప్రాణాలు తీసిన...ఐదు రూపాయలు Wed, Jul 06, 2022, 05:45 PM
త్వరలోనే బీజేపీలో చేరతా: రచనా రెడ్డి Wed, Jul 06, 2022, 05:45 PM