ఫౌండేషన్ పేరుతో మహిళకు టోకరా

byసూర్య | Sun, May 22, 2022, 10:12 AM

సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో మహికు టోకరా వేసి. ఆమె అకౌంట్ నుంచి 68 వేల నగదును కాజేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కురుమంచి మండలం గురువయ్యగూడేనికి చెందిన పోరిక సంధ్య తండ్రి వీరయ్యతో కొంతకాలంగా గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీలో నివాసముంటున్నారు. సంధ్య కొన్ని రోజుల క్రితం తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నాడని, వైద్యానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం చేయాలని ట్విట్టర్లో సినీనటుడు సూనూసూద్ కు ట్వీట్ చేసి అభ్యర్థించింది. ఈనెల 9వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి సంధ్యకు ఫోన్ చేసి తాము సోనూసూద్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నామని. మీ తండ్రి వైద్యానికి 10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని, ఇందుకోసం ఫోన్ ఎనీడెస్క్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని తెలిపారు. ఇది నమ్మిన సంధ్య యాప్ ను ఇన్స్టాల్ చేసుకోగా నగదును నేరుగా మీ ఖాతాలో జమచేస్తామని. ఏటీఎం కార్డు ముందు, వెనుకాల స్కాన్ చేసి ఫొటో పంపమని చెప్పారు. ఆ తర్వాత వెంట వెంటనే మూడుసార్లు సంధ్య ఖాతా నుంచి మొత్తం 68 వేల నగదు డ్రా అయినట్లు ఫోను మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చి ఫోన్ చేయగా సమాధానం రాలేదు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న సంధ్య మీర్ పేట్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.


Latest News
 

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM