సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భేటీ

byసూర్య | Sat, May 21, 2022, 02:27 PM

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇరువురు నేతలు దేశంలోని తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది.దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశమవనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.


Latest News
 

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు Wed, Jul 06, 2022, 04:20 PM
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Wed, Jul 06, 2022, 04:18 PM
వారికి టికెట్లహామీ ఇవ్వట్లేదు: రేవంత్ రెడ్డి Wed, Jul 06, 2022, 04:04 PM
హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి Wed, Jul 06, 2022, 04:03 PM
సెటైరికల్ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ Wed, Jul 06, 2022, 04:01 PM