పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: మండల విద్యాధికారి అంజయ్య

byసూర్య | Sat, May 21, 2022, 02:10 PM

ఈనెల 23 నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు సదాశివపేట మండలంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎం ఈ ఓ అంజయ్య అన్నారు. పదవ తరగతి పరీక్షలను 1256 మంది విద్యార్థులు రాస్తున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 787, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు 469 విద్యార్థులు. బాలురు 712, బాలికలు 544 మంది పరీక్షలు రాస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో 799, తెలుగు మాధ్యమంలో 362 మంది, ఉర్దూ మాధ్యమంలో 95 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల సమయము ఉదయం 9: 30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని అన్నారు. సదాశివపేట మండలంలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 160 మంది, నంది కంది పాఠశాలలో 280మంది, జిఎన్హెచ్ఎస్ లో 240 మంది, సెంట్ మేరీస్ లో ఒక 150, భాష్యం పాఠశాలలో 150 మంది, సెయింట్ ఆంటోని పాఠశాలలో 160 మంది, ఆత్మకూరు పాఠశాలలో 120 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 7 మంది చీఫ్ సూపర్డెంట్ లను ఏడు మంది డిపార్ట్మెంటల్ అధికారులను 80 మంది ఇన్విజి లెటర్స్ ను నియమించడం జరిగిందని తెలిపారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM