హైదరాబాద్​లోని ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ కలకలం

byసూర్య | Sat, May 21, 2022, 01:22 PM

 హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ కలకలం సృష్టించాడు. రోగి బంధువులకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుందామనుకున్నాడు.కానీ అని పథకం బెడిసి కొట్టి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోషనగర్ కు చెందిన 19 ఏండ్ల మహ్మద్‌ జహీరుద్దీన్‌ అనే యువకుడు ఈ నెల 16న వైద్యుడి వేషధారణలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-1లోని ఓ ఆస్పత్రికి వచ్చి మూడో అంతస్తులోని ఐసీయూ వార్డులోకి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న రోగి వద్దకు వెళ్లి అతని సహాయకుడి ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. అనంతరం రోగి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి అత్యవసరంగా శస్ర్త చికిత్స చేయాలని, రూ. 15,500 పంపించాలని కోరాడు. దాంతో వారు.. తాము ఈఎస్ఐ పథకంలో చేరామని, డబ్బులు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. అయితే ఈఎస్ఐ కార్డు ద్వారా వచ్చిన వారికి రూ.12,500 రాయితీ ఇస్తున్నామని, మిగతా డబ్బు చెల్లించాలని చెప్పాడు. అనుమానం వచ్చిన రోగి కుటుంబసభ్యులు విషయాన్ని ఆస్పత్రి వర్గాల దృష్టికి విషయం తీసుకెళ్లారు. వారు ఆరా తీయగా అతడు నకిలీ డాక్టర్‌ అని తేలింది. ఆస్పత్రి సెక్యూరిటీ అధికారి సాగర్‌ చారి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.


 


 


Latest News
 

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM
దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM
కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి ఖరారు.. మాజీ మహిళా మంత్రి కుమారుడికి ఛాన్స్ Tue, Apr 16, 2024, 07:30 PM