వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు

byసూర్య | Fri, May 20, 2022, 04:32 PM

హైదరాబాద్‌లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యుల ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఓ వ్యక్తికి గంటపాటు సర్జరీ చేసి కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించామని తెలిపారు. సర్జరీ అనంతరం ఆ రాళ్లను అతని కుటుంబ సభ్యులకు వైద్యులు చూపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. "నల్లగొండ జిల్లాకు చెందిన వీరమళ్ల రామకృష్ణయ్య(56) ఆరు నెలల క్రితం కడుపులో నొప్పి రావడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వాడటంతో నొప్పి తగ్గిపోయింది. కానీ, ఆ నొప్పి క్రమ క్రమంగా అధికమైంది. భరించలేని నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించాడు. రామకృష్ణయ్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. దాంతో బాధితుడికి గంటపాటు వైద్యులు సర్జరీ చేసి, 206 రాళ్లను బయటికి తీశారు. ప్రస్తుతం రామకృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Latest News
 

శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాన్ని ప్రధాని నెరవేర్చారన్నారు: బండి Wed, Jul 06, 2022, 04:27 PM
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు Wed, Jul 06, 2022, 04:20 PM
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Wed, Jul 06, 2022, 04:18 PM
వారికి టికెట్లహామీ ఇవ్వట్లేదు: రేవంత్ రెడ్డి Wed, Jul 06, 2022, 04:04 PM
హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి Wed, Jul 06, 2022, 04:03 PM