రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు!

byసూర్య | Thu, May 19, 2022, 05:03 PM

తెలంగాణలోని ఓ రేకుల ఇంటికి రూ.7 లక్షల కరెంటు బిల్లు రావడం కలకలం రేపింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ కుటుంబం ఓ రేకుల ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే ఎప్పుడూ లేనంతగా తన ఇంటికి రూ.7 లక్షల కరెంటు బిల్లు రావడంతో సంపత్ షాక్ తిన్నాడు.

గత నెలలో సంపత్ కుటుంబం 117 యూనిట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగించింది. అన్ని యూనిట్లకు గాను రూ.7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. లక్షల్లో బిల్లు రావడమేంటని సంపత్ వెంటనే బిల్లు కలెక్టర్ ను కూడా అడిగినా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు మామూలుగా అయితే రూ. 400 వరకు కరెంట్ బిల్లు వచ్చేదని, ఇప్పుడు ఇలా రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక ఫ్యాన్, టీవీ ఉన్న రేకుల ఇంటికి ఇలా రూ. 7.2 లక్షల కరెంట్ బిల్లు రావడంతో స్థానికులు అధికారుల తీరుపై ఫైర్ అవుతున్నారు.


Latest News
 

జిల్లా బిజెపి నేత సంగప్ప కు ఘన సన్మానం Wed, Jul 06, 2022, 03:26 PM
బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్ Wed, Jul 06, 2022, 02:32 PM
రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం Wed, Jul 06, 2022, 02:31 PM
మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్ Wed, Jul 06, 2022, 02:30 PM
అక్కడ ఇకపై ఇంటర్మీడియట్ విద్య బోధన Wed, Jul 06, 2022, 02:29 PM