![]() |
![]() |
byసూర్య | Thu, May 19, 2022, 04:17 PM
సింగరేణిలో 2014 జూన్ 1 నుంచి 2022 ఏప్రిల్ 19 వరకు పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న ఆర్‌ఎల్‌సీ సమక్షంలో నిర్వహించిన చర్చల్లో యాజమాన్యం వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పెండింగ్ లో ఉన్న వారసత్వ ఉద్యోగాలిస్తామని అంగీకరించింది. ఆ మేరకు కొన్ని నిబంధనల కారణంగా వారసత్వ ఉద్యోగాలు దక్కక పెండింగులో ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
సింగరేణి ఉద్యోగి జీవిత భాగస్వామి ప్రభుత్వోద్యోగిగా ఉంటే వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగానికి అర్హత ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి వారికి ఉద్యోగాలు దక్కనున్నాయి. అలాగే మెడికల్ బోర్డు నిర్వహించడంలో జాప్యం వల్ల వయోపరిమితి 35 ఏళ్లు దాటిపోవడంతో ఉద్యోగం దక్కని వారి విషయంలోనూ సింగరేణి సానుకూలంగా స్పందించింది.