అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన

byసూర్య | Tue, May 17, 2022, 08:39 PM

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 21 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుప‌వ‌నాలు 2 రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర - దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కి.మీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


Latest News
 

బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్ Wed, Jul 06, 2022, 02:32 PM
రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం Wed, Jul 06, 2022, 02:31 PM
మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్ Wed, Jul 06, 2022, 02:30 PM
అక్కడ ఇకపై ఇంటర్మీడియట్ విద్య బోధన Wed, Jul 06, 2022, 02:29 PM
ఉరేసుకుని యువకుడు బలవన్మరణం Wed, Jul 06, 2022, 02:11 PM