తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల భూయాన్.!

byసూర్య | Tue, May 17, 2022, 03:39 PM

ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గువాహటి రాష్ట్రాల హైకోర్టుకు కొత్త సీజేలను నియమించనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది.
జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు.

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ విపిన్‌ సంఘీని ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అమ్జద్‌ ఎ. సయీద్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు సీజేగా, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రష్మిన్‌ ఎం. ఛాయాను గువాహటి హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. ఎస్‌. షిండేను రాజస్థాన్‌ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM