ఓయూ విద్యార్థులకు అలర్ట్‌

byసూర్య | Tue, May 17, 2022, 01:26 PM

ఉస్మానియ యూనివర్సీలో డిస్టేన్స్‌ ఎడ్యుకేషన్‌ చేస్తున్న విద్యార్థుకుల కీలక ప్రకటన చేసింది ఓయూ. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.బీఏ, బీకామ్‌, బీబీఏ తదితర కోర్సుల పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, ఈ పరీక్షలను 26వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రొఫెసర్‌ నగేశ్‌ చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్న ప్రొఫెసర్‌ నగేశ్‌… ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. అయితే ఇప్పటికే తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM