యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న డీహెచ్‌ శ్రీనివాసరావు

byసూర్య | Tue, May 17, 2022, 12:15 PM

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని డీహెచ్‌ శ్రీనివాసరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఉప ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృంద ఆశీర్వచనం చేయగా.. ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయ గోపురాలు, ప్రాకారాలు, అభివృద్ధి పనులను పరిశీలించి, హర్షం వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం తిరుమలకు ధీటుగా నిర్మాణం జరుపుకున్నదంటూ హర్షం వ్యక్తం చేశారు. నాడు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మిస్తే.. నేడు సీఎం కేసీఆర్‌ యాదాద్రి నిర్మాణం చేపట్టారని కొనియాడారు.కరోనాతో రెండేళ్లుగా ప్రపంచమంతా అతలాకుతలమైంది అని చెప్పారు.


ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని ప్రపంచం సుభిక్షంగా ఉండేలా చూడాలని లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకుందామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో మెరుగైన ఫలితాలను సాధించిందని, పేద వారికి కూడా మంచి వైద్యం అందిస్తున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతోనే రాష్ట్రంలో వైద్యం మెరుగుపడిందని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ప్రత్యేక చర్యలతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆసుపత్రులన్నీ బలోపేతమయ్యాయని, వైద్యులు చక్కగా పని చేస్తున్నారని, ఎక్కడికక్కడ కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు.


Latest News
 

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం Fri, Mar 29, 2024, 08:15 PM
మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు Fri, Mar 29, 2024, 08:15 PM
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ, కలెక్టర్ Fri, Mar 29, 2024, 08:14 PM
టీడీపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి Fri, Mar 29, 2024, 08:13 PM
తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్.. మూడు రోజులు ముందుగానే! Fri, Mar 29, 2024, 08:10 PM