విద్యావ్యవస్థ పటిష్టతకు కృషి: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

byసూర్య | Tue, May 17, 2022, 10:40 AM

విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు మన ఊరు-మన బడి కార్య క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాయపోల్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మన ఊరు-మన బడి పథకం కింద 121 కోట్లతో చేపట్ట నున్న పాఠశాల పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మండలంలో వివిధ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, భవనాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని ఈ పనులను రాయపోల్ గ్రామం నుంచి ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా 9 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జెడ్పీటీసీ మహిపాల్, సర్పంచ్ బల్వంత్ రెడ్డి, పీఆర్ఎస్ఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీ టీసీలు శ్రీశైలం, జ్యోతి, ఎంపీడీఓ క్రాంతికిరణ్, ఎంఈఓ వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మంజుల, శ్రీనివాస్ పాల్గొన్నారు.


 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM