తడసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అధైర్యపడవద్దు: జడ్పిటిసి

byసూర్య | Tue, May 17, 2022, 09:02 AM

బోయినిపల్లి మండలం పలు గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిచి పోగా, రైతులు ఎవరు కూడా ఆధైర్య పడద్దని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు. బోయినిపల్లి మండలం మర్లపేట గ్రామంలో కల్లాలో తడిచిన ధాన్యం వారు పరిశీలించారు. అనంతరం జడ్పీటీసీ ఉమకొండయ్య మాట్లాడుతూ తడిచిన ధాన్యం ఏ గ్రేడ్ పరిగణించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.


వారి వెంట స్థానిక సర్పంచ్ గుడ్ల సుకన్య-శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ మేడుదుల మల్లేశం, తెరాస మండలాధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మండల కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ, ఎంపీటీసీ లు ఆక్కినపల్లి ఉపేందర్, ఐరెడ్డి గీత-మల్లారెడ్డి, ఉప సర్పంచ్ లెంకల సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ అధికారిని ప్రణీత, తెరాస నాయకులు కోంకటి మధు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM