రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!

byసూర్య | Tue, May 17, 2022, 09:00 AM

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికారపు అశోక్ కోరారు. మంగళవారం ఉదయం ఆయన మాట్లాడుతూ మొన్న అర్ధ రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు గ్రామాలలో రైతులు వేసిన పంటలతో పాటు వరి ధాన్యం తడిసి నష్టం వచ్చిందన్నారు. ప్రతి వ్యవసాయ సీజన్ లో కూడా అకాల వర్షాలు పడుతుండడంతో రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ఆయా గ్రామాల్లో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో పూర్తి సర్వే చేయించి బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.


Latest News
 

కాలుష్యం అవుతున్న ఉదయ సముద్రం రిజర్వాయర్ Thu, Apr 18, 2024, 01:46 PM
రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ నేత దుర్మరణం Thu, Apr 18, 2024, 01:00 PM
విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడు Thu, Apr 18, 2024, 01:00 PM
నేడు బీ-ఫామ్‌ అందుకోనున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు Thu, Apr 18, 2024, 12:33 PM
నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM