వాతావరణ అప్డేట్ వివరాలను చూద్దాం!

byసూర్య | Tue, May 17, 2022, 08:56 AM

ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు అయిందని వారన్నారు. రాబోయే మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 26 నుంచి 29 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని వారు స్పష్టం చేశారు. అయితే పగటి వేళ ఎండల తీవ్రతతో కొంత వేడి వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. అలాగే పలు మండలాల్లో ఆకాశం కొంత మేఘావృతమయ్యే అవకాశం ఉందన్నారు. భిన్న వాతావరణం ఏర్పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Latest News
 

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM