పదో తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

byసూర్య | Tue, May 17, 2022, 08:52 AM

నిజామాబాద్‌ జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం సమావేశమై మాట్లాడారు. 22,436 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా.. 153 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాలన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. స్థానిక సంస్థల అదనపు పాలనాధికారిణి చిత్రామిశ్రా, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌, డీఈవో దుర్గప్రసాద్‌, డీపీవో జయసుధ ఉన్నారు.


Latest News
 

నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి Fri, Mar 29, 2024, 02:50 PM
దేవునిపల్లిలో ఒకరి అదృశ్యం Fri, Mar 29, 2024, 02:47 PM