తెలంగాణ విద్యార్థులు అలెర్ట్..... ఇంటర్ బోర్డు క్యాలెండర్ విడుదల

byసూర్య | Mon, May 16, 2022, 08:40 PM

తెలంగాణ ఇంటర్ బోర్డు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు జూన్ 15న ప్రారంభమవుతాయని చెప్పారు. తరగతులు, సెలవులు, విద్యా సంబంధిత పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 220 రోజులు ఉన్నాయి.ఈమేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.మొదటి సంవత్సరం జూన్ 1న మరియు రెండవ సంవత్సరం జూన్ 15న తరగతులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు.. జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు.. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి.మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు ఉంటాయని.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. మే 2023 చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ మరియు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM