అవమానం బరించలేక పోతున్న చావలని ఉంది: బ్యాంక్ ఆఫ్‌ బరోడా క్యాషియర్

byసూర్య | Mon, May 16, 2022, 04:41 PM

వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్‌ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యాషియర్ ప్రవీణ్ కోర్టులో లొంగిపోయాడు. రోజుల క్రితం రూ. 22 లక్షలతో ఉడయిచడాని ఆరోపణల పై ప్రవీణ్ పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టులో లొంగిపోయాడు. గత వారం రోజులుగా గాలిస్తున్న పోలీసులు, అజ్ఞాతంలో ఉండి సెల్ఫీ వీడియోలు విడుదల చేసిన ప్రవీణ్ బ్యాంక్ అధికారులపై ఆరోపణలు చేశాడు. హయత్ నగర్ కోర్టు క్యాషియర్ ప్రవీణ్ కు ఈ నేల 30వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. క్యాషియర్ ప్రవీణ్ మీడియా తో మాట్లాడుతూ. ఇప్పటి ఈ అవమానం బరించలేక పోతున్న చావలని ఉంది క్యాషియర్ ప్రవీణ్ తెలిపాడు. మీడియా లో తనపై వచ్చిన కథనాలకి విరక్తితో చెయ్యి మణికట్టు కోసుకుని ఆత్మహత్య యత్నం చేశానని తెలిపాడు.

నేను వారణాసి గోవాకి వెళ్ళలేదు, ఇక్కడనుండి నేరు గా నల్గొండ జిల్లా చిట్యాల వెళ్లి అక్కడ బైక్ వదిలి అక్కడ నుండి ఆటో లో నల్గొండకు వెళ్లి బస్ లో దేవరకొండ అక్కడనుండి బస్ లో జడ్చర్ల, బెంగులుర్ వెళ్లానని అక్కడ 20 కిలోమీటర్ లు వానలో నడిచి అక్కడ ఒక ఊరిలో ఇతరుల ఫోన్ తీసుకుని ఇష్ట గ్రాం లో మీడియా కి సెల్ఫి విడియో పెట్టానన్నారు. యూట్యూబ్ లో వచ్చిన విడియో లు చూసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, కేవలం నేను తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని ఇప్పటికీ ఈ అవమానం బరించలేక బతకాలని లేదని క్యాషియర్ ప్రవీణ్ అన్నారు.


Latest News
 

వివాహిత మిస్సింగ్ క‌ల‌క‌లం Wed, Apr 24, 2024, 01:10 PM
బోర్లంలో ఇంటింటి ప్రచారం Wed, Apr 24, 2024, 01:08 PM
విద్యుత్తు షాక్‌తో గేదె మృతి Wed, Apr 24, 2024, 01:06 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ Wed, Apr 24, 2024, 01:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన మున్నూరు కాపులు Wed, Apr 24, 2024, 01:01 PM