సర్కార్ బడుల రూపురేఖలు మార్చేందుకే మన ఊరు-మన బడి: ఎమ్మెల్యే

byసూర్య | Mon, May 16, 2022, 03:53 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 77 లక్షలతో చేపడుతున్న వంటశాల, డైనింగ్ హాల్, నూతన టాయిలెట్స్, వాటర్ ట్యాంకులు, కరెంటు రిపేర్లు, బిల్డింగ్ రిపేర్ల పనులకు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి అని అన్నారు. మూడు దశలలో మూడేళ్ల పాటు విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. పాఠశాలల ఆధునీకరణకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ రఘు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, సీనియర్ నాయకులు బూరుగు బావి హనుమంత్ రావు, పాఠశాలల హెడ్ మాస్టర్ లు వెంకట్ రెడ్డి, శకుంతల, కౌన్సిలర్లు పూజారి వసంత, సువర్ణ, మంజూల, సూర్యకల, శంకుతల, డప్పు కిరణ్, రవీందర్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు అన్వర్, మంగమ్మ, సత్తమ్మ, కొంపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, నాయకులు జిమ్మి దేవేందర్, వినోద్, ప్రవీణ్, లక్ష్మణ్, కుమార్, రాకేష్, సాయిగౌడ్, వేణు యాదవ్, భూలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు Thu, Apr 25, 2024, 07:38 PM
హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో Thu, Apr 25, 2024, 07:34 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM
ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM
'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్ Thu, Apr 25, 2024, 07:18 PM