బుద్ధ విగ్రహం వద్ద నివాళులర్పించిన పర్యాటక శాఖ మంత్రి

byసూర్య | Mon, May 16, 2022, 12:49 PM

బుద్ధ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న బుద్ధ విగ్రహం వద్ద పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్. గౌడ్, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బుద్ధుని జన్మదినాన్ని పురస్కరించుకొని బుద్ధ జయంతిని జరుపుకుంటాము ఇది శాంతియుతమైన వాతావరణంలో అతని జ్ఞానోదయం బుధునికి సంబంధించిన చరిత్రను గుర్తు చేసుకొంటాము అని అన్నారు. తూర్పు, దక్షిణ ఆసియా నుండి, ముఖ్యంగా జపాన్, చైనా, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ నుండి దేశీయ, విదేశీ పర్యాటకులకు తెలంగాణ టూరిజం పట్ల విపరీతమైన ఆకర్షణ కారణంగా బౌద్ధ పర్యాటకాన్ని ప్రత్యేక ఆసక్తి గల పర్యాటక గమ్యస్థానంగా గుర్తించింది అని అన్నారు.

తెలంగాణ టూరిజం 2566వ బుద్ధ జయంతి వేడుకలను 16 మే, 2022న బుద్ధ పూర్ణిమ సందర్భంగా నిర్వహిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాస్ గౌడ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సేవలు, పర్యాటక, సంస్కృతి తెలంగాణ పురావస్తు శాఖ మంత్రితో పాటు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పర్యాటక శాఖ ఎమ్ డి శ్రీ బి. మనోహర్, ఇతర ప్రముఖులు హుస్సేన్ సాగర్ సరస్సులోని బుద్ధ విగ్రహం వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలు బౌద్ధ పర్యాటకానికి, మన బౌద్ధ వారసత్వాన్ని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడతాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అని ఈ కార్యక్రమంలో వారు అన్నారు.


Latest News
 

కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM
సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ Fri, Mar 29, 2024, 12:07 PM
కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల Fri, Mar 29, 2024, 12:06 PM
న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా Fri, Mar 29, 2024, 12:04 PM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:03 PM