బీజేపీ సిద్ధం.. టీఆర్ఎస్ సిద్ధమా? కేసీఆర్‌కు అమిత్ షా సవాల్

byసూర్య | Sat, May 14, 2022, 11:00 PM

కేసీఆర్‌కు అమిత్ షా సవాల్ విసిరారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా? అని కేసీఆర్‌కు షా సవాలు విసిరారు. అధికారంలోకి రాగానే ప్రతి గింజా కొంటామని తెలిపారు. తన మాటలు వింటుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అమిత్‌షా అన్నారు.

రజాకార్ల ఒడిలో కూర్చున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్టు కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి అసమర్థ సీఎంను చూడలేదన్నారు. బాయిల్డ్‌ రైస్ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లు రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో కేంద్ర పథకాల పేర్లు మార్చడం తప్ప కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను కేసీఆర్‌ అమలుచేయాలని అన్నారు. వరంగల్‌ సైనిక్‌ స్కూల్‌కు 2016లో అనుమతి ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా తెలిపారు.


Latest News
 

మందకృష్ణ నాతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తా: కేఏ పాల్ Tue, May 17, 2022, 09:57 PM
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ Tue, May 17, 2022, 09:25 PM
సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్ Tue, May 17, 2022, 08:47 PM
నేడు తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..? Tue, May 17, 2022, 08:40 PM
అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన Tue, May 17, 2022, 08:39 PM