కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను రానక్కరలేదు.. అతను చాలు: అమిత్ షా

byసూర్య | Sat, May 14, 2022, 10:38 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తాను రానక్కరలేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అమిత్ షా అన్నారు. ఇది ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని అన్నారు.

నిరంకుశపాలనను అంతమొందించడం కోసం ఈ యాత్ర అని షా స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ సమానహక్కు ఉందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా విమర్శించారు.

తెలంగాణ మారాలా? వద్దా?. హైదరాబాద్ నిజాంను మార్చటానికి యాత్ర చేపట్టామని అమిత్‌షా అన్నారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలకు అందించారా? అని ప్రశ్నించారు. మేం అధికారంలోకి రాగానే వాటిని అమలుచేసి చూపిస్తామని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని కేసీఆర్‌ వాగ్దానం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో కొత్తగా 4 సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కట్టిస్తాం కేసీఆర్‌ అంటున్నారని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో పరిస్థితి ఒకసారి చూడాలని అమిత్‌షా ప్రజలకు సూచించారు.

కేసీఆర్ మజ్లిస్ చంక ఎక్కికూర్చున్నారని, మజ్లిస్ పార్టీ అంటే కేసీఆర్‌కు భయమని, తెలంగాణ విమోచనదినం గురించి కేసీఆర్ వాగ్దానం చేశారా? లేదా అని షా ప్రశ్నించారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని, టీఆర్ఎస్, మజ్లిస్‌ను ఒకేసారి విసిరేయాలని ప్రజలకు షా పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బెంగాల్ లా మారుద్దామని కేసీఆర్ భావిస్తున్నారని షా విమర్శించారు. సాయిగణేష్ హత్యపై ఏం సమాధానం చెబుతారని? ప్రశ్నించారు. మేం పంట కొనుగోలు చేస్తామని చెప్పారు.


Latest News
 

మందకృష్ణ నాతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తా: కేఏ పాల్ Tue, May 17, 2022, 09:57 PM
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ Tue, May 17, 2022, 09:25 PM
సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్ Tue, May 17, 2022, 08:47 PM
నేడు తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..? Tue, May 17, 2022, 08:40 PM
అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన Tue, May 17, 2022, 08:39 PM