'పుల్లారెడ్డి' మనవడు పై గృహ హింస కేసు నమోదు

byసూర్య | Sat, May 14, 2022, 10:22 PM

ఆయన ఓ పేరొందిన కుటుంబంలోని వ్యక్తి. భార్యతో కొంత కాలంగా విభేదాలున్నాయి. వాటిని పెద్ద మనుషుల సమక్షంల పరిష్కరించుకోవాల్సింది పోయి, మరింత జఠిలం చేసుకున్నాడు. భార్య ఇంట్లో ఉండగానే, ఆమె బయటకు రాకుండా గోడ కట్టేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తన పరిస్థితిని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి సాయంతో బయటపడి, భర్త తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

'పుల్లారెడ్డి స్వీట్స్' షాపు యజమాని పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై గృహ హింస కేసు నమోదైంది. తనను ఇంట్లోనే ఉంచి గోడ కట్టేశాడని ఆయన భార్య ప్రగ్యారెడ్డి శనివారం హైదరాబాద్‌లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు. ఏక్‌నాథ్ రెడ్డి-ప్రగ్యారెడ్డి దంపతుల మధ్య కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. ఈ తరుణంలో భార్య ఇంట్లో ఉండగా బయటకు రాకుండా ఏక్‌నాథ్ రెడ్డి ప్లాన్ చేశాడని ఆయన భార్య ఆరోపిస్తోంది. తనను ఇంట్లో పెట్టి, తాళం వేసుకుని వెళ్లిపోయాడని తెలిపింది. పై అంతస్తు నుంచి కిందికి రాకుండా అడ్డంగా గోడ కట్టినట్లు వెల్లడించింది. ఇక ప్రగ్యారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

మందకృష్ణ నాతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తా: కేఏ పాల్ Tue, May 17, 2022, 09:57 PM
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ Tue, May 17, 2022, 09:25 PM
సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్ Tue, May 17, 2022, 08:47 PM
నేడు తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..? Tue, May 17, 2022, 08:40 PM
అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన Tue, May 17, 2022, 08:39 PM