అనుమానంతో భార్యపై కత్తి తో దాడి చేసిన భర్త

byసూర్య | Sat, May 14, 2022, 09:51 PM

భార్యాభర్తల మధ్య విభేదాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న మనస్పర్థలు, అనుమానంగా మారుతున్నాయి. మనసులో కక్ష పెట్టుకుని, సమయం చూసి తమ జీవిత భాగస్వామిని అంతమొందిస్తున్నారు. తాజాగా ఓ భర్త తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయడానికి కత్తితో వెళ్లాడు. ప్రాణభయంతో ఆమె పరుగులు తీసింది. అనంతరం జరిగిన పరిణామాలాలను పోలీసులకు వివరించారు.

హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ సమీపంలో సుమతి (25), రాజు నివసిస్తున్నారు. ఇక జీవనోపాధి కోసం సుమతి సమీపంలోని వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో పని చేస్తోంది. కొన్నాళ్లుగా తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రాజు అనుమానిస్తున్నాడు. ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవ పడ్డాడు. శనివారం తన భార్యను హత్య చేద్దామని కత్తి తీసుకుని, ఆమె పని చేస్తున్న బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. కత్తితో వచ్చిన రాజును చూసి అక్కడి వారంతా హడలెత్తి పోయారు. ఈ క్రమంలో భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం కత్తితో దాడి చేసే క్రమంలో చుట్టు పక్కల వాళ్లు స్పందించి, దానిని లాక్కున్నారు. కోపం పట్టలేని రాజు తన భార్య గొంతు నొక్కి ప్రాణాలు తీసేందుకు యత్నించాడు. దీంతో బ్యూటీపార్లర్ యజమాని ఈ విషయంపై పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి రాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


Latest News
 

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ పర్యటన Mon, May 29, 2023, 10:50 AM
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ Mon, May 29, 2023, 10:47 AM
శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ Mon, May 29, 2023, 10:43 AM
హైదరాబాద్ లో వర్షం Mon, May 29, 2023, 10:42 AM
అలర్ట్.. అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు వర్షం Mon, May 29, 2023, 10:40 AM