నిరుద్యోగులకు శుభవార్త....!

byసూర్య | Sat, May 14, 2022, 04:08 PM

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు శుభవార్త అందించారు. 4722 స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో సేవలు అందించిన వారికి ఈ నోటిఫికేషన్‌లో వెయిటేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. 24 గంటలూ రోగులను కంటికి రెప్పలా చూసుకునే వారు నర్సులే. సొంతిళ్లూ కట్టుకునే వారికి త్వరలో రూ.3 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తన సంకల్పమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని టీఆర్‌ఎస్‌ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు మూడు పూటలా భోజనం పెడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 కోట్ల 59 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అన్నారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM