రేపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం

byసూర్య | Sat, May 14, 2022, 03:11 PM

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్ లో 27. 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆదివారం ఉదయం 8. 30 గంటలకు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ప్రారంభిస్తారు.
ఇందులో త్రాగునీటి కోసం సంప్ నిర్మాణం తో పాటు, డ్రైనేజీ, సీసీ కెమెరా, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. అంతే కాకుండా లబ్ధిదారుల సౌకర్యార్థం 11 లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడిన పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన ల నుండి పురుడు పోసుకున్నది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కార్యక్రమం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలతో ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుంది.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM