సైబర్ మోసంతో 2. 67 లక్షలు పోగొట్టుకున్న యువతి

byసూర్య | Sat, May 14, 2022, 01:37 PM

 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని జక్రాన్ పల్లి మండలంలో ఓ యువతి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి 2. 67 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.  పోలీసుల కథనం ప్రకారం. కలి గోట్ గ్రామానికి చెందిన యువతికి గుర్తు తెలియని నంబరు నుంచి లక్కీడ్రా ద్వారా రూ. 12. 80 లక్షలు గెలుపొందినట్లు సంక్షిప్త సందేశంతో పాటు ఓ లింక్ వచ్చింది. ఆమె దాన్ని తెరవగా అపరిచిత వ్యక్తి ఆమెకు ఫోను చేశాడు. ప్రవేశ రుసుము, రాష్ట్ర, కేంద్ర పన్నులు చెల్లించాలంటూ వారం రోజుల వ్యవధిలో వంతుల వారీగా రూ. 2. 67 లక్షలు కట్టించుకున్నాడు. ఆ తర్వాత అతడి సెల్ నంబరు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వివరించారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM