![]() |
![]() |
byసూర్య | Sat, May 14, 2022, 01:24 PM
వివాహిత అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి మధురనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉండే చల్ల దత్తు మేస్త్రి పని చేసుకుంటాడు. అతనికి తాడువాయి చెందిన యమునతో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం దత్తు పనులకు వెళ్లిన తర్వాత యమున తన తల్లిగారి ఇంటికి వెళ్తున్నానని పక్కన ఉండే బంధువులకు చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఆచూకి కోసం చాలా చోట్ల గాలించిన దొరకలేదు. దీంతో దత్తు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.