తల్లి శవం పక్కనే మూడు రోజులుగా కొడుకు...!

byసూర్య | Sat, May 14, 2022, 12:21 PM

తెలంగాణలో దారుణం జరిగింది. హైదరాబాద్‌ లో మూడు రోజులుగా తల్లి శవం పక్కనే కొడుకు ఉన్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పూరి కాలనీ మైత్రి నివాస్ అపార్టుమెంట్ లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి శవం పక్కనే మూడు రోజులుగా ఫ్లాట్లోనే ఆమె కొడుకు సాయి కృష్ణ కూడా ఉండటం కలకలం రేపింది. సాయికృష్ణ కు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు.


తల్లి, కొడుకులు రోజూ గొడవ పడేవారని స్థానికులు తెలుపుతున్నారు. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అపార్ట్ మెంట్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లి శవం పక్కనే మూడు రోజులుగా కొడుకు ఉండటం స్థానికంగా కలకలం రేపింది. 


Latest News
 

తెలంగాణ కరోనా అప్డేట్ Thu, May 19, 2022, 09:36 PM
పంటలు లేట్‌గా వేసుకునేలా చేసింది ఎవరు: వైఎస్ షర్మిల Thu, May 19, 2022, 09:26 PM
తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM