నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

byసూర్య | Sat, May 14, 2022, 12:13 PM

హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనసమీకరణ చేశారు. ఈ క్రమంలో బీజేపీ సభ ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడ వచ్చే దారులు బీజేపీ బహిరంగ సభ కారణంగా అధిక రద్దీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చంద్రాయనగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు ప్రత్యమ్నాయ మార్గలు ఎంచుకోవాలి అని సూచించారు. అంతేకాకుండా ఓఆర్ ఆర్ ఎగ్జిట్ నెం. 14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు అనుతించామని పోలీసులు వెల్లడించారు.

Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM