ఇంటి జాగా కోసం 10వేల మందితో ర్యాలీ

byసూర్య | Sat, May 14, 2022, 09:18 AM

రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన శుక్రవారం తిమ్మాపూర్ క్రాస్ నుండి ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు ఎమ్మార్వో ఆఫీస్ వరకు, 10 వేల మందితో భారీ ర్యాలీ చేశారు.


సిపిఎం నేతృత్వంలో ఇప్పటివరకు ప్రభుత్వ భూములను గుర్తించి గుడిసెలు వేసిన పేద ప్రజానీకం ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ప్రభుత్వ భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ కి భారీ ర్యాలీగా వెళ్లారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ధర్నా సందర్బంగా తహసీల్దార్ కు అందజెశారు. దాదాపు ముడు గంటల పాటు ఎర్రటి ఎండలో ఎటూ కదలకుండా ధర్నాలో కూర్చున్నారు.


ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా వచ్చిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య మాట్లాడుతూ ఖిలా వరంగల్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు తిమ్మాపూర్ ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ 241 బెస్తం చెరువు శిఖం సర్వే నెంబర్ 102/1, 105/1, 106/1, 107/1, బి, 108/1, 120/1, 119/9, 121/1, 121/2, 128/2 జక్కలొద్ది, రంగశాయిపేట శివారు ప్రాంతాల్లో గల 180, 181, 182, మామూనూర్ శివారు పుట్టకోట భూములను పేద ప్రజలకు ఇవ్వాలని, అదేవిధంగా ఈ సర్వే నెంబర్ గల భూములను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందని ప్రయివేటు వ్యక్తులకు ప్రభుత్వం తొత్తులుగా మారి వ్యహరిస్తుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి సభ్యులు సాంబమూర్తి, ప్రత్యూష, జ్యోతి, రమేష్, బన్న కృష్ణ, ఓదెలు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM