నాటుసారా తరలిస్తుండగా పట్టుబడ్డ వ్యక్తులపై కేసు నమోదు

byసూర్య | Sat, May 14, 2022, 09:12 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామ శివారులో నాటు సారా తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఎక్సైజ్ సీఐ ఎం పీ ఆర్ చంద్రశేఖర్. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామం బుగ్గ రాజేశ్వర తండాకు చెందిన అజ్మేరా బాల్ సింగ్ అనే వ్యక్తి శనివారం తన ద్విచక్రవాహనంపై ఐదు లీటర్ల గుడుంబా, 40 కిలోల బెల్లం, 20 కిలోల పటిక స్వాధీనం చేసుకొని అజ్మేర బాల్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నామని ఎక్సైజ్ సి. ఐ. ఎం. పి. ఆర్. చంద్రశేఖర్ తెలిపారు.


ఇట్టి నాటుసారాయి తయారు చేసి అల్మాస్ పూర్ స్టేజి వద్ద అమ్ముతున్నానని తెలిపాడు. నాటు సారాయి ముడి సరుకు ఎవరు సరఫరా చేస్తున్నారని బాల్ సింగ్ ను విచారించగా మామిండ్ల రాజు వెంకటాపూర్ వాస్తవ్యులు సరఫరా చేస్తున్నాడని తెలిపినాడు. నాటుసారాయి , మోటర్ సైకిల్ పై, అజ్మేర బాల్ సింగ్, మామిండ్ల రాజు ముద్దాయిలపై కేసు నమోదు చేసినట్లు సి. ఐ. తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ రాజేందర్, రాజు‌ , ప్రధీప్ , మల్లేశ్ , కీషోర్ కుమార్ , దివ్య మరియు లలిత పాల్గొన్నారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM