ఈ నెల 18న తెలంగాణ లోని 57 ఎస్సి ఉపకులాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష

byసూర్య | Sat, May 14, 2022, 09:09 AM

ఈ నెల 18 వ తేదీన తెలంగాణ లోని 57 ఎస్సి ఉపకులాల ఆధ్వర్యంలో ఎస్సి ఉపకులాల సమస్యలపై హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టనున్నారు.


ఎస్సి ఉపకులాల సమస్యలపై హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర నిరసన దీక్ష కార్యాక్రమం యొక్క గోడ పత్రికను జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం ముందు శుక్రవారం ఏర్పాటు చేసిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ మదాసి కురువ/మదారి కురువ ఎస్సి సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు డా. కురువ విజయ్ కుమార్ ముఖ్య అతిథి గా వచ్చి విడుదల చేశారు.


డా. కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గతంలో తప్పుడు బీసీ కురువ కులపత్రాలు ఇచ్చిన వారి అందరికి జాతీయ ఎస్సి కమీషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమో నెంబర్ 1268 ను అమలు చేసి ఎస్సి మదాసి కురువ కుల పత్రాలు జారీ చేయాలని అన్నారు. అదేవిదంగా తెలంగాణలోని అన్ని ఎస్సి ఉపకులాలకు ఆర్దీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ల ద్వారా కుల పత్రాలు జారీ చేయాలని, దళిత బందు పథకంలో అన్ని ఎస్సి ఉపకులాలలకు జనాభా దామాషా ప్రకారం 40 శాతం కేటాయించాలని, ఎస్సి ఉపకులాలను అత్యంత వెనకబడిన షెడ్యూల్డ్ కులాలు మోస్ట్ బ్యాక్ వర్డ్ షెడ్యూల్ కాస్ట్ ఎంబిఎస్సి గా గుర్తించి వెంటనే ఎంబిఎస్సి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల నిధులను కేటాయించాలని, ఎస్సి ఉపకులాల కుల వృత్తులను ప్రోత్సహించుటకు ప్రత్యేక బోర్డును ఏర్పరచి నిధులను కేటాయించాలని కోరారు.


అలాగే ఎస్సి ఉపకులాలకు చట్టసభలు, రాజ్యాంగ బద్ద పదవులలో జనాభా దామాషా ప్రకారం సమాన వాటా కల్పించాలని అన్నారు. పై డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనే ఈనెల 18 వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర నీరసన దీక్ష చేస్తున్నాము కావున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఉపకులాల కుల సోదరులు ఈ కార్యాక్రమమునకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని తెలంగాణ మదాసి కురువ/మదారి కురువ ఎస్సి సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు డా. కురువ విజయ్ కుమార్ పిలుపునిచ్చాడు.


ఈ కార్యక్రమములో మదాసి కురువ సంగం అలంపూర్ తాలూకా అధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి ప్రాగటూర్ గోపాల్, ఐజ జోళ్ళబ్బాయి, రామాపురం కృష్ణ, బతుకన్న, సోమన్న, భీముడు, అడివెప్ప, అంజి, బీచుపల్లి, టైలర్ వెంకటేష్, మద్దూరు నర్సింహులు, ఆంజనేయులు, రాజోలి, బూడిద పాడు చిన్నరాముడు వెంకటేష్, రాజోలి మండల అధ్యక్షుడు వెంకట్రాములు, శివప్రసాద్, పోతుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM