అక్రమ నల్లా కనెక్షన్లపై చర్యలు: మీషన్ భగీరథ ఏఈ ప్రణీత్

byసూర్య | Sat, May 14, 2022, 08:55 AM

అక్రమంగా నీటిని వినియోగిస్తే చర్యలు తప్పవని మిషన్ భగీరథ ఇబ్రహీంపట్నం ఏఈ ప్రణీత్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బూడిద రాంరెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి నల్లాలను పరిశీలించారు. ఉప్పరిగూడ గ్రామం తో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా నల్లా కనెక్షన్లను గుర్తిస్తున్నామన్నారు. వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. అక్రమంగా నల్లాలను వాడినట్లు రుజువు అయితే 5 వేలు జరిమానా వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యులు గోపాల్, పంచాయతీ కార్యదర్శి రిషిక, కారోబార్ నర్సింహ పాల్గొన్నారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM