ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

byసూర్య | Sat, May 14, 2022, 08:42 AM

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజుపేట గ్రామానికి చెందిన జూకూరి సత్తయ్య(55) శుక్రవారం నల్లగొండ నుంచి బైక్‌పై స్వ గ్రామానికి తిరిగి వస్తుండగా దుప్పలపల్లి ఫ్లైఓవర్‌పైకి రాగానే ఎదురుగా వస్తున్న అ దే గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలవడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తయ్యకు వివాహితులైన ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు ఉన్నా రు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM