పబ్, రెస్టారెంట్ యజమానులతో సీపీ ఆనంద్ భేటీ

byసూర్య | Fri, May 13, 2022, 06:56 PM

పబ్బులు, రెస్టారెంట్ల యజమానులతో సీపీ సీవీ ఆనంద్ భేటీ అయ్యారు. డ్రగ్స్, పబ్బులు, రెస్టారెంట్ల లో గంజాయి, హాష్ ఆయిల్ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్ధరాత్రి వరకు ఓవర్ సౌండ్ తో డీజేలు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. రోడ్లపై వాహనాలు ఆగకుండా చూడాల్సిన బాధ్యత యజమానులపై ఉందన్నారు. చిన్నపాటి లాభాల కోసం నగరానికి చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు.

పబ్‌లు 30 రోజుల బ్యాకప్‌తో కూడిన సీసీ  ఫుటేజీని కలిగి ఉండాలన్నారు. రాత్రి 11 గంటల తర్వాత ఆర్డర్లను స్వీకరించవద్దని చెప్పారు. పబ్‌లను రాత్రి  12 గంటలలోపు మూసివేయాలని ఆదేశించారు. శుక్ర, శని వారాల్లో గ్రేస్ పీరియడ్ కోసం అదనంగా ఒక గంట కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికులు, ప్రతినిధుల కోసం 24 గంటల పాటు స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం విక్రయించేందుకు అనుమతిస్తామని ఆనంద్ తెలిపారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM