మాజీ ఎమ్మెల్యే పై మర్డర్ కేసు కొట్టివేత.!

byసూర్య | Fri, May 13, 2022, 06:00 PM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పై హత్య కేసును కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సోదరుడు జగన్మొహన్ 2013 జూలై 18న హత్యకు గురయ్యాడు.
ఈ కేసులో ఎర్రశేఖర్ ఏ 1 గా ఉన్నాడు. ఈ కేసులో ఎర్ర శేఖర్ ను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండల పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ అతని సోదరుడు జగన్మోహన్ లు చింతకుంట సర్పంచ్ పదవిని తమ భార్యలు పోటీ చేయించాలని తల పెట్టారు.

ఈ విషయమై ఇద్దరి మధ్య రాజీ కుదరలేదని అప్పటి అభియోగం. ఎర్ర శేఖర్ భార్య భవాని జగన్మోహన్ భార్య ఆశ్విత కూడా సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయమై సోదరుల మధ్య విబేధాలు వచ్చాయి. ఈ విషయమై మాట్లాడేందుకు గాను సోదరుడిని కారులో తీసుకు వచ్చే క్రమంలో మాటా మాటా పెరిగి ఎర్ర శేఖర్ జగన్మోహన్ పై తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపిపట్టుగా అప్పటి ఎస్పీ ప్రకటించారు. ఈ కేసులో ఎర్ర శేఖర్ 2013 ఆగష్టు 27న ఎస్పీ ఎదుట లొంగిపోయాడు.

ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఎర్ర శేఖర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కొంత కాలం పాటు జైలు శిక్ష అనుభవించిన ఎర్ర శేఖర్ బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాాల్లో చురుకుగానే ఉన్నాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలోని జిల్లా నేతలతో సఖ్యత లేకపోవడంతో ఎర్ర శేఖర్ ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎర్ర శేఖర్ సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారం సాగుతుంది.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM