బండి సంజయ్‌ పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

byసూర్య | Fri, May 13, 2022, 05:21 PM

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. న్యాయవాది చేత బండి సంజయ్‌ కి కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈనెల 11న ట్విట్టర్‌ లో తనపై బండి సంజయ్ ఆరోపణలు చేశారని కేటీఆర్‌ అన్నారు. ఆరోపణలపై ఆధారాలు ఉంటే చూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దురుద్దేశంతోనే బండి సంజయ్‌ అబద్ధాలు చెప్పారని కేటీఆర్‌ న్యాయవాది అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను కేటీఆర్‌ కి ఆపాదించారని తెలిపారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌ కి పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. 48 గంటల్లో కేటీఆర్‌ కి క్షమాపణ చెప్పాలన్న న్యాయవాది డిమాండ్ చేశారు.


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM