రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

byసూర్య | Fri, May 13, 2022, 04:08 PM

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర ఓ అర్ అర్ పై  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా…మరో 18 మంది గాయపడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అర్ అర్ పై తెల్లవారుజామున 5గంటల సమయంలో ఘట్కేసర్ వైపు నుండి కీసర వైపు వస్తున్న పెండ్లి బృందం వాహనం. తుఫాను వాహనం  ప్రమాదానికి గురైంది. డ్రైవర్ రామచందర్ కు మూర్ఛ రావడంతో  ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది కి గాయాలు , ఒకరు మహిళ మృతి చెందింది. గాయాలైన వారిలో నూతన వదువరులు ఉన్నారు. మంగళగిరిలో పెండ్లి చేసుకొని తిరుగు ప్రయాణం జిడిమెట్ల కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM